పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ కథానాయిక. ఏ. దయాకర్ రావు, ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది.
17 శతాబ్దానికి చెందిన మొగల్ పాలనను ప్రతిబింబించేలా భారీ దర్బార్ సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ దర్బారు సెట్లో ఔరంగజేబు, వీరమల్లు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర టీమ్‌లోకి బాబీ డియోల్‌కు స్వాగతం పలుకుతూ ఓ వీడియోను విడుదల చేశారు.