Arjundas | అర్జున్ దాస్, దుసరా విజయన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై వసంత బాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నది. తెలుగులో ఎస్ఆర్డీఎస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్, ఎమోషన్స్‌తో పాటు అన్ని కమర్షియల్ అంశాలను మేళవించి రూపొందించిన చిత్రమిది. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. తప్పకుండా ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత దేవసాని శ్రీనివాస రెడ్డి తెలిపారు.