Republic | హీరో చచ్చిపోతే ఒప్పుకోరా.. రిపబ్లిక్ ఫలితం ఏం చెప్పింది..?

సినిమా ఎలా ఉంది రా..
అంతా బాగుంది కానీ చివర్లో హీరో చచ్చిపోయాడ్రా..
అవునా హీరో చచ్చిపోతే సినిమా ఏముంది.. ఇంక సినిమా ఆడదు..
.. కామన్‌గా ఇద్దరు తెలుగు ఆడియన్స్ కొత్త సినిమా గురించి మాట్లాడుకుంటే వచ్చే కబుర్లు ఇవి. తెలుగు సినిమాల్లో హీరో చచ్చిపోతే అస్సలు ఒప్పుకోరు ప్రేక్షకులు. అది ఎంత బాగున్నా కూడా చివర్లో హీరో చచ్చిపోయాడు అంటే చాలు.. అప్పటి వరకు బాగున్న సినిమాను కూడా మరిచిపోతారు. ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో ఇది నిజమైంది. ఇప్పుడు రిపబ్లిక్ ( Republic ) సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. సినిమా చాలా బాగా తీశాడు దేవా కట్టా అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎలాంటి పక్కదారి పట్టకుండా అనుకున్న కథను చాలా బాగా తెరకెక్కించాడు.. అంటూ ఆయనను మెచ్చుకుంటున్నారు సినిమా లవర్స్. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే రిపబ్లిక్ సినిమాకు తొలి రోజు కనీసం రెండు కోట్ల షేర్ కూడా రాలేదు. సాయి ధరమ్ తేజ్ సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ చాలా తక్కువ వసూలు చేసింది. సినిమాకు టాక్ బాగానే వచ్చినా కూడా చివర్లో నెగిటివ్ ఎండింగ్ ఇవ్వడంతో.. ఆ ఇంపాక్ట్ సినిమాపై పడింది. అప్పటి వరకు సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్‌లో హీరో చచ్చిపోయేసరికి.. ప్రేక్షకులు ఒక రకమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో బయటికి వచ్చారు. అరె హీరో చచ్చిపోవడం ఏంటి అంటూ పెదవి విరిచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
అందుకే సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినా కూడా నెగిటివ్ క్లైమాక్స్ కలెక్షన్స్ పై దారుణమైన ప్రభావం చూపిస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే సినిమా కేవలం ప్రశంశలకు మాత్రమే మిగిలి.. కమర్షియల్ గా విజయానికి దూరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ప్రభాస్ చక్రం.. అల్లు అర్జున్ వేదం లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఆ సినిమాలు బాగున్నా కూడా చివర్లో హీరో చచ్చిపోతాడనే ఒకే ఒక్క కారణంతో ఫ్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు రిపబ్లిక్ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Republic Review | రిపబ్లిక్ సినిమాలో చెప్పాలనుకున్న కంటెంట్ పబ్లిక్కు రీచ్ అయిందా..?
Republic: అనేక ఛాలెంజెస్ నడుమ 64 రోజుల్లో రిపబ్లిక్ షూటింగ్ పూర్తి- మేకింగ్ వీడియో
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
samantha naga chaitanya divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

