Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ మూడో వారం చేరుకుంది. ఇప్పటికే బేబక్కతో పాటు శేఖర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేషన్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నేడు బిగ్ బాస్‌లో జరిగే ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు నిర్వహాకులు.
ఈ ప్రోమోలో మణికంఠ, యష్మిల మధ్య భారీ ఫైట్ నడిచినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మణికంఠ యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతూ.. నామినేషన్ అయ్యే వరకు ఏం ఆలోచించకు ప్లీజ్ అంటూ హగ్ చేసుకుంటాడు. అయితే మణికంఠ హగ్‌ను యష్మి రిజెక్ట్ చేస్తుంది. వదిలేయ్ అంటూ కాస్త గట్టిగానే చెబుతుంది. అంతేగాకుండా తాను వెళ్లిపోయాక ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్ గురించి చెబుతూ.. నాకు వీడితో రోజు మెంటల్ టార్చర్ అవుతుంది. వచ్చి హగ్ చేసుకుంటాడు. అతని హగ్ కంఫర్టబుల్‌గా లేదు. అది చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. నేను ఉన్నంత వరకు వాడిని (మణికంఠ) నామినేట్ చేస్తూనే ఉంటాను అంటూ యష్మి చెప్పుకోచ్చింది.