Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఎనిమిదో వారం ఎవరు ఊహించని విధంగా మెహబూబ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ వారంకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. రచ్చరచ్చగా సాగింది ఈ ఎపిసోడ్ ప్రోమో.
ఈ ప్రోమో చూస్తే.. ఈ వారం ఓ భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు నామినేట్ చేయగా.. ఇప్పుడా పవర్‌ను మెగా ఛీఫ్ విష్ణుప్రియకు అప్పగించాడు. దీంతో ఈ వారం నామినేట్ చేసేది విష్ణుప్రియ అని ప్రోమో ద్వారా తెలిసిపోయింది. ఇప్పటి నుంచి వారాలు గడిచే కొద్దీ ఆట మరింత కఠినతరం కాబోతుంది. మీ ప్రయాణంలో ఈరోజు జరగబోయే నామినేషన్స్ అత్యంత ముఖ్యమైనవి. మెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లోవారి ప్రయాణాన్ని మరింత ముందుకు కొనసాగించడానికి అనర్హులని భావించే ఐదుగురు సభ్యులని నామినేట్ చేసి ఒక్కొక్కరినీ జైల్లో పెట్టి తాళం వేయండి అంటూ ప్రోమోలో బిగ్ బాస్ చెబుతాడు.
అయితే బిగ్ బాస్ అలా చెప్పగానే విష్ణుప్రియ అందరికి షాక్ ఇస్తూ.. గౌతమ్‌ను ఫస్ట్ నామినేట్ చేసింది. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇదే పాయింట్ చెప్పి ఇక ప్రతి వారం అందరూ నన్ను నామినేట్ చేస్తారా?.. నా కంటే తక్కువ పని చేసేవాళ్లు.. నాకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నోళ్లు నీ ముందు ఉన్న కూడా నువ్వు నన్నే నామినేట్ చేశావు దీని గురించి నాకు ఓ క్లారిటీ కావాలి. అంటూ విష్ణుప్రియను అడుగుతాడు.
దీంతో గౌతమ్ మాటలపై విష్ణుప్రియ సీరియస్ అవుతుంది. అయితే ఇదే విషయంలో యష్మీ గౌతమ్‌ను ఇక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకు అంటూ కౌంటర్ ఇస్తుంది. దీంతో నువ్వు ఆగక్కా అంటాడు. దీంతో చిర్రెత్తుకోచ్చిన యష్మీ నన్ను అక్కా అని పిలవకు.. యష్మీ అని పిలువు.. ఒకసారి క్రష్, ఒకసారి అక్కా నన్ను పిలవకు అంటూ గౌతమ్‌పై ఫైర్ అయ్యింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.