Pooja Ramachandran | తల్లి కాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్
Pooja Ramachandran | బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతి అని ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. భర్త జాన్ కొకెన్కు లిప్‌లాక్ ఇస్తూ దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది
Pooja Ramachandran | బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతి అని ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. భర్త జాన్ కొకెన్కు లిప్‌లాక్ ఇస్తూ దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అనేక భావోద్వేగాల మధ్య తమ ప్రయాణం మరో కీలక దశకు చేరుకున్నదని. ఒక చిన్న అద్భుతం తమ మధ్యలోకి రాబోతోందని.. 2023 తమకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని రాసుకొచ్చింది.
నిజానికి పూజా రామచంద్రన్‌కు విజె క్రెగ్‌తో డేటింగ్ చేసి.. 2017లో అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆ తర్వాత జాన్ కొకెన్తో సహజీవనం చేసింది. బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లొచ్చిన తర్వాత 2019లో జాన్ కొకైన్‌ను పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచి జాన్ కొకెన్తో కలిసి విహారయాత్రలు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. వీటికి సంబంధించిన ఫొటోలను పూజా రామచంద్రన్.. ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో పూజా రామచంద్రన్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
లవ్ ఫెయిల్యూర్ సినిమాతో పూజా రామచంద్రన్ టాలీవుడ్‌కు పరిచయమైంది. స్వామి రారా సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లోనూ పూజా రామచంద్రన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఏ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా ఆడియన్స్‌కు చేరువ కాలేకపోయింది. అలాంటి సమయంలో బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. తన అందచందాలతో యూత్‌ను కట్టిపడేసింది.చివరగా పవర్ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాల్లో కనిపించింది.
Read More :
Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్‌గ్రౌండ్ వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

