Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు ఫినాలే దశకు చేరుకుంది. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ టైటిల్ రేస్ కోసం శక్తివంచన లేకుండా పోటీ పడుతున్న వేళ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఒకరైన దివ్వెల మాధురి చేసిన సోషల్ సర్వీస్ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి వారమే తన మాస్ అటిట్యూడ్ , స్పీడ్ గేమ్‌ప్లే , హౌస్‌మేట్స్‌తో ఘర్షణల వలన అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అదే సమయంలో ఆమెపై కొంత నెగెటివ్ స్పందన రావడంతో నాగార్జున ఇచ్చిన హెచ్చరికతో ఆమె గేమ్ స్ట్రాటజీ మార్చుకుంది.
అయితే హౌస్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయినప్పటికీ, మాధురి వ్యక్తిగతంగా చేసే మంచి పనులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మాధురి తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ మొత్తాన్ని ఆపదలో ఉన్న వారికి ఇవ్వడం ద్వారా తన మంచి మనసు చాటుకుంది.దువ్వాడ శ్రీను–మాధురి దంపతుల అనుచరుడైన లక్ష్మీ నారాయణ బ్రెయిన్ సంబంధిత తీవ్రమైన వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరామర్శించిన మాధురి, శ్రీనివాస్ కుటుంబానికి మొత్తం రూ.80,000 ఆర్థిక సాయం అందించారు. .30,000 .. ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం, రూ.50,000 కుటుంబ పోషణ కోసం ఇచ్చారు.
ఈ మొత్తం సాయం మాధురి తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ నుంచే ఇచ్చినట్లు సమాచారం. ఆమె చేసిన ఈ సేవ కార్యక్రమం నుంచి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధురి చేసిన సేవా కార్యక్రమం చూసి నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. షోలో తక్కువ రోజులు ఉన్నప్పటికీ, ఆ రెమ్యునరేషన్‌ను మంచి పనికి వినియోగించడం గొప్ప నిర్ణయమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాగా, కళ్యాణ్ – తనూజ మధ్య టైటిల్ రేస్ హీట్ పెరిగినప్పటికీ, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన మాధురి చేసిన మానవతా సేవే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది. తన గేమ్‌ప్లేతో రచ్చ రచ్చ చేసిన మాధురి, ఇప్పుడు తన మంచితనంతో అందరినీ ఆకట్టుకోవడం అభిమానులను మరింత ఇంప్రెస్ చేస్తోంది.