Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 81వ రోజు ఎపిసోడ్ పూర్తిగా వినోదాత్మకంగా సాగింది. మాజీ కంటెస్టెంట్లు వరుసగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ, హౌస్‌మేట్స్‌తో కలిసి టాస్కులు, సరదా సన్నివేశాలతో ఎపిసోడ్‌కి రంగులద్దారు. మొదటగా యావర్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. రాగానే తనూజతో ఫ్లర్టింగ్ చేస్తూ హౌస్‌ను నవ్వులతో నింపాడు. యానిమల్ మూవీ నుంచి ‘ఎవరెవరో’ పాట ప్లే అవుతుండగా తనూజకు రొమాంటిక్ స్టైల్లో ప్రపోజ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. యావర్‌కు ఇచ్చిన టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను పోటీదారుడిగా ఎంచుకోగా, చివరికి ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు.ఇదిలా ఉండగా, హౌస్‌లో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. భరణి తన మెడిసిన్స్ కనిపించడం లేదంటూ కెప్టెన్ రీతూకి కంప్లైంట్ చేశాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రీతూ, హౌస్‌మేట్స్‌ను అలర్ట్ చేసింది. చివరకు ఆ మెడిసిన్స్ సంజన దగ్గర ఉన్నట్లు తెలిసి, పరిస్థితి మరింత తీవ్రం కాకముందే ఆమె వాటిని తిరిగి ఇచ్చేసింది.ఈ చర్చలో దివ్య మధ్యలో మాట్లాడడం భరణికి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తి పెద్ద వాదనగా మారింది.తర్వాత హౌస్‌లోకి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాగానే ఇమ్మాన్యుయేల్ సరదాగా జోకులు వేస్తూ హౌస్‌లో నవ్వులు పంచాడు. శోభా తనకి పోటీగా దివ్యను ఎంచుకోగా, టాస్క్‌లో దివ్య విజయం సాధించింది. తర్వాత సోహైల్ ఎనర్జిటిక్ ఎంట్రీ హౌస్‌లో మరోసారి ఉత్సాహాన్ని నింపింది. హౌస్మేట్స్ కోసం చికెన్, పాలు, కాఫీ పంపాలని బిగ్ బాస్‌ను కోరిన సోహైల్‌కు, బిగ్ బాస్ తన తరహాలోనే మొదట ఫోటోల్నే పంపి ఆటపట్టించాడు. అనంతరం నిజంగానే హౌస్‌కు ఫుడ్ ఐటమ్స్ పంపించాడు.
సోహైల్‌తో జరిగిన టాస్క్‌లో సంజన, రీతూ ఇద్దరూ విజయం సాధించారు. ఇంతలో చివరి కెప్టెన్సీ రేస్‌కు కంటెండర్లుగా కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజన, రీతూ అర్హత సాధించారు. వారిని బిగ్ బాస్ ప్రశంసిస్తూ అభినందనలు తెలిపాడు. 81వ రోజు ఎపిసోడ్ మొత్తం సస్పెన్స్, ఫన్, వాదోపవాదాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. మరి చివరి కెప్టెన్ ఎవరు అవుతారు అనే ఆసక్తి అందరిలో ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రేక్షకులకి మంచి వినోదం పంచే ప్లాన్స్ చేస్తున్నారు నిర్వాహకులు..