Bigg Boss 9 | 12వ వారం హైడ్రామా .. కెప్టెన్సీ టాస్క్‌లో తీవ్ర ఘర్షణలు, భావోద్వేగాలు
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 12వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 12వ వారం ముగింపు దశకు చేరుకుంది. ఓవైపు ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, మరోవైపు కెప్టెన్సీ కోసం హౌజ్‌మేట్స్ మధ్య జోరుగా పోరు సాగుతోంది. కెప్టెన్ పదవి కోసం ఇమ్మాన్యుయెల్, సంజనా, దివ్య, రీతూ, కళ్యాణ్, డీమాన్ పవన్ పోటీలో నిలిచారు. టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌజ్‌మేట్స్ మధ్య పలు విభేదాలు చోటు చేసుకున్నాయి. సంజనా–రీతూ, రీతూ–దివ్య మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తనను టాస్క్ నుంచి తప్పించిన రీతూకు సంజనా కౌంటర్ ఇస్తూ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు హౌజ్ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
మరోవైపు పవన్ తనను పోటీ నుంచి బయటకు నెట్టాడని భావించిన ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యాడు. ఈ వారం టాస్క్ హౌజ్‌లో భావోద్వేగాలు, గందరగోళాలు, హీట్ లెవెల్స్ అన్నీ పీక్స్‌లో కనిపించాయి. చివరకు కెప్టెన్సీ రేసులో డీమాన్ పవన్, కళ్యాణ్ మాత్రమే మిగిలారు. వీరిద్దరికీ “రోడ్డు నిర్మాణం” టాస్క్ ఇచ్చారు. కంకర, ఇసుకతో గుంతలు పూడ్చే ఈ కఠినమైన టాస్క్‌లో పవన్ తీవ్రంగా అలసిపోయాడు. ఇసుక మోయడంలో ఒత్తిడి పెరగడంతో పవన్‌కు వెన్నునొప్పి తీవ్రంగా పెరిగి టాస్క్‌ను పూర్తిచేయలేని స్థితికి చేరుకున్నాడు. పవన్ అలా బాధపడుతుండడం చూసి రీతూ చౌదరీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. పవన్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించడం, అతనిపై చూపిన ఆందోళన సోషల్ మీడియాలో కూడా చర్చగా మారింది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక పవన్, రీతుల రిలేషన్‌పై సంజనా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే, పవన్‌పై రీతూ చూపుతున్న కేర్ హౌజ్‌లో ఆమెను హైలైట్‌గా మార్చింది. ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటూనే మరోవైపు తన ఆటతో, భావోద్వేగాలతో రీతూ ప్రేక్షకుల మద్దతు పొందుతోంది. క్రమంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదుగుతోందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరీ, సంజనా, భరణి, సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. వీరిలో రీతూ తప్ప మిగిలిన వారందరూ నామినేషన్లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. దివ్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీజన్ 9లో 12వ వారం పూర్తవుతున్న ఈ సమయంలో బిగ్ బాస్ హౌజ్‌లో గేమ్, భావోద్వేగాలు, వ్యూహాలు మరింత ఆసక్తికరంగా మారాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

