షణ్ముఖ్ జస్వంత్ మామూలుగా చక్రం తిప్పట్లేదుగా.. కుర్రాడు యమ డేంజర్..

shanmukh jaswanth in bigg boss 5 telugu | ఒక్కసారి మనుషులు అలాగే మారిపోతుంటారు. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్‌ను చూస్తే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్‌బాస్ మొదలైన తర్వాత మొదటి నాలుగు వారాలు మనోడి ఆటతీరు చాలా డల్‌గా ఉంది. ఇదేంటి ఈ కుర్రాడు ఇంత సైలెంట్‌గా ఉన్నాడు.. ఇలాగైతే ఇంట్లో ఉండొచ్చు కదా.. ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు అంటూ సెటైర్లు కూడా పేలాయి. అయితే నాలుగో వారం ఈయనపై ఏకంగా ఇంటి సభ్యులు అందరూ దండయాత్ర చేశారు. సీక్రెట్ నామినేషన్లో ఏకంగా 8 మంది నామినేట్ చేశారు. దాంతో షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా తనలో నిద్రపోతున్న ఆటగాడిని తట్టి మరీ లేపాడు.
ఐదో వారం ఈ కుర్రాడి ఆటలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎదురు వెళ్లిపోతున్నాడు. అందులో కొన్నిసార్లు తన తప్పు ఉన్నా కూడా దూసుకుపోతున్నాడు. తన స్నేహితుడు జెస్సీ విషయంలో కెప్టెన్ శ్రీరామ్ తో విభేదించి.. కంటెంట్ బాగానే ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. ఇక తాజాగా ఇంట్లో నడుస్తున్న ఒక టాస్క్ లో భాగంగా తన ఇద్దరు మిత్రులతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు షణ్ముఖ్. బిగ్ బాస్ రూల్స్ కు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు మనోడు చేస్తున్న పనులు చూసి అయ్య బాబోయ్ అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి నామినేట్ చేస్తేనే ఇంత రచ్చ చేస్తున్నాడు.. అరేయ్ ఏంట్రా ఇది అంటూ షాక్ అయిపోతున్నారు.
లాజిక్ మాట్లాడుతూ ఇంటి సభ్యులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అందరి కంటే ముందు ఇంట్లో నాణాలను దొంగతనం చేసి తన దగ్గర దాచుకున్నాడు. సిరి, జెస్సితో తనకు కావాల్సిన గేమ్ ఆడిస్తున్నాడు షణ్ముఖ్. ఈ వీకెండ్ కచ్చితంగా ఈయనకు నాగార్జున చేతిలో పెద్ద రేంజ్లో క్లాస్ ఉంటుంది అని అర్థమవుతుంది. అయితే అది ఏ విషయంపై అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని టాస్కుల కంటే ఎక్కువగా మిగిలిన కంటెస్టెంట్స్ పై జోకులు వేస్తున్నారు షణ్ముఖ్ జశ్వంత్. ఏదేమైనా కూడా ఈ వారం ఓటింగ్ లో అందరి కంటే ముందు దూసుకుపోతున్నాడు ఈ కుర్రాడు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఆటతీరు చూపిస్తే ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Priyanka: ప్రియాంక నిర్ణయాన్ని స్వాగతించిన తండ్రి.. బోరున ఏడ్చిన ట్రాన్స్‌జెండర్
Hameeda: శ్రీరామ్, హమీదా రాత్రిపూట మరింత రెచ్చిపోతున్నారుగా..!
Bigg Boss: అనీ మాస్టర్‌తో కుస్తీ పడ్డ జస్వంత్..!
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?
ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత.. మరి మోహన్ బాబును రాజశేఖర్ ఎందుకు కలిశారు? ఇదిగో క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

