అనారోగ్యంగా ఉన్నా జెస్సీ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..

Jessie in Bigg Boss Telugu 5 | అనారోగ్యం కారణంగా గత వారం రోజులుగా బిగ్‌బాస్ ఇంట్లో ఉండటం లేదు కంటెస్టెంట్ జెస్సీ. ఆయనను సీక్రెట్ రూమ్‌లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెర్టిగో అనే అనారోగ్య సమస్యతో 20 రోజుల నుంచి బాధ పడుతున్నాడు జెస్సీ . ఈ కారణంతోనే నామినేషన్స్‌లో కూడా లేని జెస్సీని బయటకు పంపించేశాడు బిగ్ బాస్. ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ లోపలికి రావడం అనేది దాదాపు అసాధ్యం. మరీ ముఖ్యంగా అనారోగ్యం కారణంగా బయటకు వెళ్తే అనధికారికంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లే. కానీ చివరి నిమిషంలో మరో ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ జెస్సీ బయటికి వెళ్లలేదు.. సీక్రెట్ రూమ్‌లోనే ఉన్నాడు. అలాగని ఆయన అనారోగ్యం తగ్గింది అనుకోవటం తప్పే. ఎందుకంటే ఇప్పటికీ ఆ సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్నాడు జెస్సీ. ఈ వారం ఒకరిని యథావిధిగా ఎలిమినేట్ చేసి వచ్చే వారం ఎలిమినేషన్ లేకుండా జెస్సీని పంపించాలనే ప్లాన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా మానస్, కాజల్ వైపు కనిపిస్తున్నాయి. సన్నీ తన ఆటతో భారీగానే అభిమానులను సంపాదించుకున్నాడు. దాంతో ఓటింగ్ కూడా ఆయనకు అత్యద్భుతంగా ఉంది.
ఆ తర్వాత యాంకర్ రవి ఎప్పట్లాగే మంచి ఓటింగ్‌తో ముందుకు వెళుతున్నాడు. షణ్ముఖ్ జస్వంత్ ఫాలోవర్స్ అందరూ సిరికి ఓట్లు గుంపగుత్తగా గుద్దేస్తున్నారు. దాంతో ఈ వారం కాజల్, మానస్ డేంజర్ జోన్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం కాజల్ చివరి స్థానంలో ఉంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఇప్పుడు ఆమెకు పడుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కాజల్‌కు ఉన్నట్లు కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
priyanka singh| పింకీ ప్లాన్ చేసి మరీ సన్నీని వెన్నుపోటు పొడిచేసిందిగా..!
Deepthi: షణ్ముఖ్‌పై అరిచినందుకు సన్నీకి ఇచ్చి పడేసిన దీప్తి
Jaswanth: జెస్సీకి తిరగబెట్టిన రోగం.. సీక్రెట్ రూంలో వింత సమస్యలతో బాధపడుతున్న మోడల్
Shanmukh: షణ్ముఖ్‌కి చుక్కలు చూపించిన సిరి.. ఏకంగా కాళ్లు కూడా పట్టించింది..!
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

