Shiva Kandukuri | టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి (Shiva Kandukuri) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు ఉండగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో జరిగిన వరుస హత్యల ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ హత్యలు ఎవరు చేశారు అని కనిపేట్టే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ట్రైలర్ ప్రస్తుతం యుట్యూబ్లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో రాశి సింగ్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.