యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సాగర్‌చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నాం.
బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని దర్శకుడు తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘ఛత్రపతి’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.