Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 05నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా.. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు.
#Bhimaa streaming from April 5 on #DisneyPlusHotstar#Gopichand #MalvikaSharma #PriyaBhavaniShankar pic.twitter.com/q3CSW0x675
— ganesh dhoni talkies (@GDTalkies) March 27, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది కర్ణాటకలోని పరశురామ క్షేత్రం- మహేంద్రగిరి. ఆ ప్రాంతంలో దివ్యఔషధ గుణములుండే మొక్కలు వుంటాయి. అలాగే ఓ మహిమ గల శివాలయం వుంటుంది. చనిపోయిన వారి చివరి కోరిక న్యాయ బద్దమైనదైతే, ఆ శివాలయంలో పూజలు చేస్తే ఆ కోరిక తీరుతుంది. అయితే అనూహ్యంగా ఆ గుడిని మూసివేయాల్సి వస్తుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు భీమా (గోపీచంద్). తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రౌడీ భవాని కి ఎలా బుద్ధి చెప్పాడు? ఈ కథలో రవీంద్ర వర్మ( నాజర్) పాత్ర ఏమిటి ? మూతపడిన గుడికి భీమాకి వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.