మనందరి బయోపిక్ ఇది
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రోమియో జూలియట్'. భార్గవ్ మాచర్ల దర్శకుడు. నవరస ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు.
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకుడు. నవరస ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ సినిమా నుంచి ‘సారీ బేబీ’ అనే పాటను విడుదల చేశారు. హీరో హర్షిత్ మాట్లాడుతూ ‘మా సినిమా గ్లింప్స్‌ను ప్రభాస్‌గారు రిలీజ్ చేయడంతో పాటు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
విభిన్నమైన ప్రేమకథ ఇది. నేను చేసిన క్యారెక్టర్‌ను ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు’ అన్నారు. మనందరి బయోపిక్‌గా ఈ సినిమా గురించి చెప్పొచ్చని, ఎందుకంటే అందరూ ఏదో ఒక సన్నివేశంతో తప్పకుండా కనెక్ట్ అవుతారని, వినోదం..భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథ ఇదని దర్శకుడు భార్గవ్ మాచర్ల తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, రచన: భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాగతి, దర్శకత్వం: భార్గవ్ మాచర్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

