సీనియర్ దర్శకుడు భరత్ పారేపల్లి రైతుగా ప్రముఖ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘నాగలి’. పావని మొక్కరాల సమర్పకురాలు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
నూతన నటీనటులతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: పెద్దాడ మూర్తి.