Dolly Sohi | గర్భాశయ క్యాన్సర్‌తో టీవీ నటి మృతి
Dolly Sohi | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెలివిజన్ నటి డాలీ సోహీ (Dolly Sohi) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 47.
Dolly Sohi | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెలివిజన్ నటి డాలీ సోహీ (Dolly Sohi) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 47. గత కొన్ని రోజులుగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న డాలీ.. నవీ ముంబై (Navi Mumbai)లోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. డాలీ సోదరి అమన్‌దీప్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో డాలీ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
‘డాలీ ఇక లేరు. ఈ తెల్లవారుజామున 4.00 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించింది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మేము నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చాము. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది’ అని డాలీ సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు. అదేవిధంగా మరో సోదరి అమన్‌దీప్ కామెర్ల కారణంగా డీవై పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వెల్లడించారు.
Also Read..
flight loses tyre | విమానం టేకాఫ్ కాగానే ఊడిన చక్రం.. వీడియో
Kedarnath Yatra | మే 10న కేదార్నాథ్ ఆలయం ఓపెన్
Saudi Arabia | వివాదానికి దారితీసిన రోబో చర్య.. మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకి.. VIDEO
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

