బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘నేను స్టూడెంట్ సార్’. ‘స్వాతిముత్యం’ తర్వాత గణేష్ నటిస్తున్న రెండో చిత్రమిది. అవంతిక దస్సాని నాయికగా నటిస్తున్నది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు.
రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించారు. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చిందని, సినిమాకు కూడా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అనిత్ మదాడి, సంగీతం : మహతి స్వరసాగర్.