Ravi Teja | సినిమా సెట్స్‌లో ఉంటే నాకు పండగే.. రవితేజ చిట్‌చాట్
టాలీవుడ్ హీరో రవితేజ చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ధమాకా (Dhamaka). డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు రవితేజ. ధమాకా సినీ విశేషాలు మాస్ మహారాజా మాటల్లోనే..
టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ధమాకా (Dhamaka).పెళ్లిసందD ఫేం శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. ధమాకా డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు రవితేజ. ధమాకా సినీ విశేషాలు మాస్ మహారాజా మాటల్లోనే…
ధమాకాపై వస్తున్న పాజిటివ్ బజ్ గురించి..
మా సినిమాకు చాలా పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. ఈ విషయం ఏ నటుడికైనా చాలా సంతోషం కలిగిస్తుంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా పని మాట్లాడుతుంది.. ప్రేక్షకులకు తప్పక సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా.
మీ గత ఫ్లాపుల గురించి చెప్పాలంటే..
నేను గతంలో చేసిన సినిమాలన్నీ చాలా నమ్మి చేసినవి. కానీ దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. సక్సెస్ సాధించే వరకు ప్రయత్నించడమే మా ధ్యేయం. కొన్ని సక్సెస్ అవుతాయి.. కొన్ని ఫెయిల్ అవుతాయి. కానీ ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాం.
ధమాకా చిత్రానికి చిరంజీవి రౌడీ అల్లుడుతో పోలికలున్నాయా..?
కొన్ని రోజులుగా ఈ ప్రశ్న అడుగుతున్నారు. రౌడీ అల్లుడు సినిమాతో కొన్ని పోలికలుంటాయి.. కానీ రెండూ ఒకేలా ఉండవు. మీరు సిల్వర్ స్క్రీన్‌పై చూసిన తర్వాత సినిమాలో కొత్తదనం ఏముందో తెలుస్తుంది. ఇలాంటి ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అవుతుంది. ధమాకాలో మా సొంత వెర్షన్ ను ప్రయత్నించాం.
భీమ్స్ సంగీతం ఎలా ఉంది..?
సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లాడు.. సినిమాలోని ప్రతీ పాట పెద్ద హిట్టవుతుంది. భీమ్స్ చాలా సైలెంట్ పర్సన్. తనను తాను సరిగ్గా మార్కెట్ చేసుకోలేరు. ఈ సినిమాతో ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నా.
శ్రీలీలతో పనిచేయడం ఎలా ఉంది..?
టాలీవుడ్లో ఉన్నత స్థానానికి చేరుకునే అద్భుతమైన ప్రతిభ శ్రీలీలకు ఉంది. ఆమె అందంగా ఉండటమే కాదు.. చాలా బాగా నటిస్తుంది..తెలుగులో మాట్లాడగలిగే అమ్మాయి. చాలా కష్టపడి పనిచేస్తుంది. శ్రీలీలతో ధమాకా షూటింగ్ చాలా సరదాగా గడిచింది.
ఒకే టైంలో చాలా సినిమాలను ఎలా మేనేజ్ చేస్తున్నారు..?
నేను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. సినిమా సెట్స్‌లో ఉండటమంటే నాకు పండగలాంటిదే. ఒకే టైంలో చాలా సినిమాలకు పనిచేయడం నాకు కొత్తేమీ కాదు .. నేనెప్పుడూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎదురుచూస్తుంటాను.
వాల్తేరు వీరయ్య గురించి..
చిరంజీవిని, నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడం థ్రిల్‌గా ఉంది. చిరంజీవికి నేను పెద్ద అభిమానిని. ఈ సినిమాలో నాది పవర్ ఫుల్ పాత్ర. ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తుండటం నాకు సంతోషంగా ఉంది.
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

