Barabar Premistha | పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (ChandraHass) రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఈ మూవీ తర్వాత బరాబర్ ప్రేమిస్తా అంటూ రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫైనల్‌గా తన లక్‌ను పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం పాపురల్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమా ప్రైమ్‌లో మంచి స్పందన రాబట్టుకుంటోంది. చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అందరూ మనసులు గెలుచుకుంటూ సక్సెస్ఫుల్ రెస్పాన్స్‌తో ట్రెండింగ్ అవుతోందని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.
పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటించింది. అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మించారు.
After a successful theatrical run, Attitude Star #ChandraHass’ #BarabarPremistha is winning hearts and trending on @PrimeVideoIN with a thumping responsehttps://t.co/ax71CBOCuj#KakarlaSatyanarayana Presents#MegnaMukherjee #SampathRudra #GedaChandu #GayatriChinni #AVR… pic.twitter.com/TNJHtrM1X3
— Ramesh Bala (@rameshlaus) May 9, 2026
Sanjeev Arora: మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ
Ravi Teja | ఫుల్ స్వింగ్‌లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!