Bandla Ganesh | ప్రశ్న రావణ్ అరెస్టులపై రచ్చ.. ప్రకాష్ రాజ్ విమర్శలు, బండ్ల గణేష్ ఘాటు కౌంటర్
Bandla Ganesh | యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అలియాస్ జోసెఫ్ బచలకురి అరెస్టుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
Bandla Ganesh | యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అలియాస్ జోసెఫ్ బచలకురి అరెస్టుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాజకీయ, న్యాయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, వాటికి నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చిన ఘాటు స్పందన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసుల్లో ఆయనకు వరుసగా బెయిళ్లు లభిస్తున్నప్పటికీ, విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది సేపటికే, ఏలూరు పోలీసులు మరో కేసులో నక్కపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆయనను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విధంగా వరుస అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రశ్న రావణ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.ఈ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.
ఒక కేసులో కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. వరుసగా బెయిళ్లు లభిస్తున్నాయంటే కేసుల బలంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించిన ఆయన, ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్టులో ప్రకాష్ రాజ్‌పై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతి అంశంపై అతిగా స్పందించడం సరికాదని పేర్కొంటూ, “ప్రపంచాన్ని మొత్తం నువ్వే నడిపిస్తున్నట్లు వ్యవహరించకు. ముందు నీ బాధ్యతలు, నీ వ్యక్తిత్వాన్ని ఒకసారి నువ్వే పరిశీలించుకో. అతి ప్రవర్తనతో గౌరవం పెరగదు. అణకువగా ఉండటం కూడా అవసరం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బండ్ల గణేష్ చేసిన ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

