ఏఆర్ రెహమాన్, శ్రీదేవిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు బాలకృష్ణ. పలు ఇంటర్వ్యూలలో సంచలన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ వస్తున్న బాలయ్య ఆదిత్య 369 మూవీ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. భారతరత్నని కించ పరుస్తూ, రెహమాన్ , శ్రీదేవిలపై సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు బాలయ్య కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, వ్యాఖ్యలను తిరిగి వెనక్కు తీసుకోవాలని పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిత్య 369 సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ అందించగా, ఆయనది ప్రత్యేకమైన పంథా అని చెబుతూ మధ్యలో రెహమాన్‌ని తీసుకొచ్చారు. రెహ్మాన్దో ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన ఎవరో నాకు తెలియదు. పదేళ్లకు ఓ హిట్ ఇస్తారు. ఆస్కార్ అవార్డు అందుకొంటారు. అవార్డులు అందుకొన్నంత మాత్రాన గొప్పవాళ్లు కాదనే విధంగా బాలకృష్ణ కామెంట్స్ చేశారు.
ఇక తన తండ్రి నందమూరి తారకరామారావు ప్రస్తావన కూడా తీసుకొచ్చిన బాలకృష్ణ.. రామారావుకు ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు. భారతరత్న ఇవ్వకపోవడం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదు. రామారావు గారికి భారతరత్న కాలి గోటితో సమానం. ఆ అవార్డు చెప్పుతో సమానం. ఆ అవార్డు ఇచ్చినందుకు రామారావుకు గౌరవం కాదు. ఆయనకు ఇచ్చిన వాళ్లకు ఆ గౌరవం దక్కుతుంది అని బాలకృష్ణ వీరావేశంగా కామెంట్స్ చేశారు.
ఇక డ్యాన్సర్స్ ప్రస్తావన కూడా తెచ్చిన బాలకృష్ణ ..ఆదిత్య 369 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత రానురాను స్టార్ హీరోయిన్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఆమె వేసుకొనే క్యాస్టూమ్స్, మేకప్ గురించి టాప్ హీరోయిన్లు ఆరా తీసేవారు. శ్రీదేవి లాంటి వాళ్లు కూడా ఆమె మేకప్, దుస్తులను అనుకరించే వాళ్లు అని బాలకృష్ణ చెప్పారు.
గొప్ప డ్యాన్సర్లు అనుకొనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కూడా డ్యాన్సర్స్ని చూసి నేర్చుకున్నారు. శ్రీదేవి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసినట్టు డ్యాన్స్ చేసేది. శ్రీదేవి లాంటి నటీనటులకు నాన్నగారు (స్వర్గీయ రామారావు) కాళ్లు తొక్కి డ్యాన్స్, యాక్టింగ్ నేర్పించారు. వీపుపై గుద్ది. నడుముపై గిచ్చి , పిర్రలపై చరిచి నాన్నగారు డ్యాన్స్ నేర్పించారు. నాన్నగారు చాలా రఫ్ కాబట్టి కాళ్లు తొక్కి మరీ డ్యాన్స్ నేర్పించేవారు అంటూ బాలయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ పై పెద్ధ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. క్షమాపణలు చెప్పాలని, చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని పలువురు అభిమానులు
డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bala krishna
- NTR
- rahman
- sridevi
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

