Balakrishna | ‘ఎఫ్3’ ని వీక్షిస్తున్న బాలకృష్ణ..ఒపీనియన్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
మరోసారి అనిల్ రావిపూడి చేసిన ఎఫ్3 (F3) మ్యాజిక్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి వస్తున్న టాక్ నందమూరి బాలకృష్ణను ఇంప్రెస్ చేసిందట. తాజా అప్ డేట్ ప్రకారం బాలకృష్ణ ఎఫ్ 3 స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడట.
టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులకు అందించిన మరో ఫన్ ప్రాజెక్టు
ఎఫ్3 (F3). మరోసారి అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి వస్తున్న టాక్ నందమూరి బాలకృష్ణను ఇంప్రెస్ చేసిందట. తాజా అప్ డేట్ ప్రకారం బాలకృష్ణ ఎఫ్ 3 స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడట. ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎఫ్ 3 షో వీక్షిస్తున్నట్టు ఫిలింనగర్ ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఈ న్యూస్ తెలియగానే తమ ఫేవరేట్ హీరో ఎఫ్ 3 సినిమాపై ఎలా స్పందిస్తాడోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారట నందమూరి అభిమానులు, మూవీ లవర్స్. మే 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్ చిత్రం మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది. ఫస్ట్ వీకెండ్లో మంచి కలెక్షన్లు రాబట్టిన ఎఫ్ 3 ఆ తర్వాతి వీక్ డేస్‌లో కూడా బాక్సాపీస్ వద్ద తన హవా కొనసాగిస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రంలో వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Kaur) హీరోహీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి మ్యూజిక్ అందించగా..సాంగ్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఎఫ్3ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్, ప్రగతి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Read Also : Chiranjeevi | సింగర్ కేకే లేరనే వార్తతో గుండె పగిలింది..చిరంజీవి ట్వీట్
Read Also : Tharun Bhascker | విజయ్, నేను గల్లీలల్ల తిరుగుతుండే : తరుణ్ భాస్కర్
Read Also : Ranbir Kapoor | వైజాగ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్..రణ్ బీర్‌కు ఘనస్వాగతం.వీడియో
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

