ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేతో వినోదాన్ని పంచిన నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇపుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) షోతో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అన్‌స్టాపబుల్ 2 ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఎపిసోడ్ చిత్రీకరించారట.
కాగా ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్న ఎపిపోడ్ గురించి ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డతో చిట్ చాట్ చేస్తున్నాడట బాలకృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ కొనసాగుతుందని ఇన్సైడ్ టాక్. ఇటీవల కాలంలో తమ సినిమాలతో యూత్ ఆడియెన్స్ ను బాగా కనెక్ట్ అయ్యారు యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ. మొత్తానికి సిద్దు, విశ్వక్ సేన్‌తో బాలయ్య టాక్ షో ఉండబోతుందన్న అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్.
ఈ ఎపిసోడ్‌తోపాటు షో మేనేజ్ మెంట్ రానున్న రోజుల్లో ఎన్టీఆర్-కొరటాల, ఎన్టీఆర్-కల్యాణ్ రామ్‌ను షోకు పిలవడంపై వర్క్ చేస్తున్నారట. కానీ ఇదిలా ఉంటే మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల బాలకృష్ణ వీరితో ఇంటర్వ్యూలు చేయడానికి రెడీగా లేడన్న టాక్ కూడా నడుస్తోంది. .
బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న ఎన్బీకే107 ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇది పూర్తవగానే అనిల్ రావిపూడితో కలిసి ఎన్బీకే108 మొదలుపెట్టనున్నాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు అన్ స్టాపబుల్ సీజన్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు బాలయ్య.