Balakrishna in unstappable show| నటసింహాం నందమూరి బాలకృష్ణ నటుడుగానే కాకుండా హోస్ట్‌గా కూడా రికార్డులు సృష్టిస్తాడని అన్‌స్టాపబుల్ షోతో నిరూపించాడు. తాజాగా ఈ షో 40కోట్ల నిమిషాలను వీక్షించిన షోగా ఆహాలో రికార్డు సృష్టించింది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా రికార్డులు తిరగరాస్తా అని బాలయ్య బాబు నిరూపించాడు. తాజాగా మహేష్‌బాబు గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ అయిపోయింది. త్వరలోనే సీజన్ 2 కు సంబంధించిన గెస్ట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూన్, జూలైలో సీజన్2 ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆహా నిర్వాహకులు బాలకృష్ణతో రాపిడ్ ఫైర్‌ను జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆహా యాజమాన్యం నెవర్ హవ్ ఐ ఎవర్ అనే షో నిర్వహించింది. ఇందులో భాగంగా యాజమాన్యం అడిగిన ప్రశ్నలకు బాలయ్య తన స్టైల్లో సమాధానాలు చెప్పాడు. కాలేజ్‌లో ఎప్పుడైనా బంక్ కొట్టారా అనే ప్రశ్నకి.. కాలేజ్‌కు ఎవరైనా బంక్ కొట్టకుండా ఉంటారా అంటూ బాలయ్య ఫన్నీగా సమాధానం చెప్పాడు. మీపై వచ్చే మీమ్స్ కు ఎప్పుడైన నవ్వుకున్నారా… అనే ప్రశ్నకు కరోనా సమయంలో లెజెండ్ సినిమాలోని డైలాగ్స్ మీమ్స్ గా చూసి నవ్వుకున్నా అని తెలిపాడు. ఎప్పుడైనా డ్యాన్స్ చేసేటప్పుడు మీ కో-స్టార్స్‌కు, కొరియోగ్రాఫర్‌కు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా.. అని అడగ్గా.. కొరియోగ్రాఫర్ హీరోయిన్‌తో పదే పదే రిహార్సల్స్ చేసేటప్పుడు వాళ్లను పిలిచి వచ్చేసిందా అని అడుగుతానని చెప్పాడు. నీకు మూమెంట్ వచ్చేసినా మళ్లీ ఓ రిహార్సల్స్ చేస్తున్నావ్ గెట్ రెడి ఫర్ ద టేక్ అని హీరోయిన్‌కి చెప్పడం వంటివి చేస్తా అన్నాడు. డ్యాన్స్ మాస్టర్ ఏ మూమెంట్ చెప్పినా మేము చేస్తాం అంటూ బదులిచ్చాడు. తన మనవడు మనవరాళ్లతో తాత అని పిలిపించుకోవడం నచ్చదని వాళ్లేప్పుడు బాలా అనే పిలవాలని వెల్లడించాడు. నేరుగా పబ్లిక్‌లోకి వెళ్లి ఏమైనా చెయ్యాలనుకుంటే ఆలోచించకుండా వెళ్లిపోతారా.. అనే ప్రశ్నకు వెళ్తా నా లాగా పబ్లిక్‌తో కలిసే ఆర్టిస్ట్ ఎవరూ లేరని చెప్పేశాడు.