NBK 109 | గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అంటే బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు బాలయ్య. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలావుంటే మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ గ్లింప్స్ చూస్తే.. బాలకృష్ణ ఎప్పటిలాగే తన పవర్ఫుల్ గెటప్‌లో కనిపించారు. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్యా డైలాగ్ చెప్పడం వీడియోకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.