అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ సినిమా అంటే, కథ నుంచి టైటిల్ వరకూ.. అన్నీ పవర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకుంటారు మేకర్స్. ఆయన 110 సినిమాల్లో శక్తిమంతమైన టైటిల్స్‌తో కూడుకున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి నిర్మాణంలో ఉంటే, మరొకటి ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నది. ఈ రెండింటికీ పేర్లు ఖరారు కాలేదు. అయితే.. ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న కొరటాల శివ సినిమాకు మాత్రం ఓ చిత్రమైన టైటిల్ ఖరారైనట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు ‘కార్పెంటర్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.
‘కార్పెంటర్’ అంటే వడ్రంగి అని అర్థం. బాలకృష్ణ లాంటి సూపర్స్టార్డమ్ ఉన్న హీరోకు ఈ టైటిల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఓ సాధారణ కార్పెంటర్ని.. కొన్ని అసాధారణ పరిస్థితులు ఉద్యమకారుడిగా ఎలా మార్చాయి? అనేది ఈ సినిమా కథాంశమని వినికిడి. ‘అధికారానికి ఉద్ధేశ్యం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది’ అనే పవర్ఫుల్ కోట్తో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలిసింది. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్, సుధాకర్ మిక్కిలినేని కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.