BB4 | బాలయ్య అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. బర్త్‌డేకు డబుల్ ట్రీట్
Balakrishna-Boyapati Srinu Movie | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే వసూళ్ల ప్రకంపనలు మొదలైనట్టే. అలాంటి కాంబోలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఒకటి.
Balakrishna-Boyapati Srinu Movie | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే వసూళ్ల ప్రకంపనలు మొదలైనట్టే. అలాంటి కాంబోలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఒకటి. వీళ్ల కలయికలో తెరకెక్కిన మూడు సినిమాలు సంచలనాలే. బాలయ్యకు కెరీర్ బెస్ట్ కలెక్షన్లు తెచ్చిపెట్టినవే. గత పదిహేనేళ్లలో బాలయ్య నటించిన సినిమాల్లో కేవలం ఐదు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. అందులో మూడు సినిమలు బోయపాటి దర్శకత్వం వహించినవే. దీన్ని బట్టే తెలుస్తుంది ఆడియెన్స్‌లో ఈ కాంబోపై ఎంత క్రేజ్ ఉందో.

సింహా, లెజెండ్, అఖండ వంటి హ్యట్రిక్ బ్లాక్బస్టర్ల తర్వాత వీళ్ల కలయికలో నాలుగో సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ పోతినేనితో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మే వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. మరోపక్క బాలయ్య అనీల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఉగాది సందర్భంగా రిలీజైన బాలయ్య పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా జూన్ నెలకల్లా పూర్తి కానుంది.

ఇక బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాత ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. బోయపాటికి అత్యంత సన్నిహితుడైన మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మాతగా వ్యవరిస్తాడని టాక్. అయితే మరోవైపు బాలయ్యతో రెండో సినిమా చేయాలని మైత్రీ కూడా ఆశపడుతుందట. ఇక పోతే బాలయ్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితార సంస్థల్లో సినిమాలకు గతంలోనే సైన్ చేశాడు. మరి ఈ కాంబో ఎవరి చేతులో పడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

