బలగం మొగిలయ్య కన్నుమూత
తెలంగాణ జానపద కళాకారుడు ‘బలగం’ఫేం మొగిలయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
- అనారోగ్యంతో జానపద కళాకారుడు మృతి
తెలంగాణ జానపద కళాకారుడు ‘బలగం’ఫేం మొగిలయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను వరంగల్ సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మొగిలయ్య తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ నేపథ్య కథాంశంతో వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా మొగిలయ్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ైక్లెమాక్స్‌లో మొగిలయ్య నటిస్తూ పాడిన ‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచీ.. నువ్వెట్టా ఎల్లీనావూ కొమరయ్యా… నీ జ్ఞపకాలు మరువమయ్యో కొమరయ్యా..’ పాట ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. మొగిలయ్య చికిత్స కోసం అగ్రనటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థిక సాయం కూడా చేశారు.
కానీ ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామమైన దుగ్గొండిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మొగిలయ్య మృతి పట్ల నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వేణు సంతాపం వెలిబుచ్చారు. తెలంగాణ సంస్కృతినీ, మూలాలను తన గానంతో భావితరాలకు తెలియజెప్పిన గొప్ప కళాకారుడు మొగిలయ్య అని వారు కొనియాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

