Balagam | ప్రముఖ కమెడీయన్ వేణు తెరకెక్కించిన బలగం సినిమాలో కీలక పాత్ర పోషించి అలరించిన జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూసారు. బలగం చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజన్న పాత్రలో నటించి అలరించారు గత కొంత కాలం నుంచి జీవీ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం వ్యక్తం చేస్తూ.. బాబు మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు. బాబు మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు
జీవీ బాబు కిడ్నీలు దెబ్బ తినడం, గొంతుకు ఇన్ ఫెక్షన్ సోకడంతో గత కొద్ది రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నోట మాట కూడా రాకపోవడంతో తన బాధను కూడా చెప్పలేకపోయాడు. చాలా రోజులుగా ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. అయితే ఆసుపత్రి బిల్లు చెల్లించలేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న సమయంలో వారి ఆర్ధిక పరిస్థితి గురించి తెలుసుకున్న బలగం దర్శకుడు వేణు, ప్రియ దర్శి తదితరులు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. జీవీ బాబు ఆస్పత్రి బిల్లులు ఎక్కువ కావడం, కనీసం మందులు కూడా కొనలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఉండగా, వారు తమకు సహాయం చేయాలని, ఆదుకోవాలని ప్రాదేయపడ్డారు.
రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇందులో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు జీవీ బాబు. కొద్ది రోజుల క్రితం బలగం సినిమా నటుడు మొగిలయ్య కూడా అనారోగ్యంతో కన్నుమూసారు.
జి వి బాబు గారు ఇకలేరు🙏
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏#balagam #artist #stage #plays #natakam pic.twitter.com/fzDHReHt8g— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 25, 2025