రవి కుమార్.. మీరు నిజమైన వీరుడిలా పోరాడారు: బాలకృష్ణ

టోక్యో ఒలంపిక్స్‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ పతకం సాధించిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో రవికుమార్కి రజతం దక్కింది. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
రవి కుమార్ దహియా మొదటి నుండి కొనసాగించిన స్పూర్తిపై దేశం గర్వ పడుతుంది. సిల్వర్ పతకం దక్కించుకున్నందుకు ప్రధాని, రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు రవికుమార్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా రవి కూమర్ని ప్రశంసించారు.
మన దేశం గర్వించే విజయం. రవి కుమార్ దహియా, మీరు నిజమైన వీరుడిలా పోరాడారు. దేశం గర్వించేలా చేశారు. టోక్యో ఒలంపిక్స్‌లో రజతం సాధించిన రవి కుమార్‌కి నా అభినందనలు. ఫైనల్లో అద్భుతంగా పోరాడి తన ప్రతిభ కనబరిచాడు. రవి కుమార్‌ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది రెజ్లర్స్ తయారు కావాలని కోరుకుంటున్నాను. దేశ ప్రజల ఆశీస్సులు క్రీడా కారులకి ఎల్లవేళలా ఉంటాయి అని బాలయ్య తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

