Bakasura Restaurant | తెలుగు సినీ ప్రియులకు ఈ ఆగస్టు 8న ‘బకాసుర రెస్టారెంట్’ పేరుతో ఓ ప్రత్యేక విందు సిద్ధమవుతోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ మంచి విందు భోజనం ఆరగించిన అనుభూతి కలుగుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఎస్.జె. శివ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్.జె. మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.జె. శివ మాట్లాడుతూ, హంగర్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు మీ హృదయాలను హత్తుకునే ఎమోషన్‌ను అందిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూశామనే సంతృప్తిని పొందుతారు అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ, ఆగస్టు 8న అత్యధిక థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్: మార్తండ్.కె.వెంకటేష్, సంగీతం: వికాస్ బడిస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వినయ్ కొట్టి, ఆర్ట్ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్ తంగాల, పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు లుగా వ్యవహరిస్తున్నారు. ‘బకాసుర రెస్టారెంట్’ ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వినూత్నమైన కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.