Bajrangi Bhaijaan sequel title | బజరంగీ భాయ్‌జాన్ సీక్వెల్ టైటిల్ ఇదే..ఫ్యాన్స్ కు సల్మాన్ ఖాన్ గిఫ్ట్
సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా బజరంగీ భాయ్‌జాన్ (Bajrangi Bhaijaan). యూనివర్సల్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.

సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా బజరంగీ భాయ్‌జాన్ (Bajrangi Bhaijaan). పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథనందించగా.. టాలెంటెడ్ డైరెక్టర్ కబీర్‌ఖాన్ (Salman Khan) దర్శకత్వం వహించాడు. యూనివర్సల్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ 56వ బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్ డేట్ అందించాడు.
ఇంతకీ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలుసా..? పవన్ పుత్ర భాయ్‌జాన్ (Pavan Putra Bhaijaan). ఫస్ట్ పార్టుకు కథ రాసిన విజయేంద్రప్రసాద్ రెండో పార్టుకు కూడా స్టోరీ రెడీ చేశాడట. అయితే కబీర్ ఖాన్ మరోసారి సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తాడా..? లేదా..? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3, కభి ఈద్ కభి దివాళి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన వెంటనే పవన్ పుత్ర భాయ్‌జాన్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు సల్లూ భాయ్. మరి ఈ సారి సల్మాన్ ఖాన్ కోసం విజయేంద్రప్రసాద్ ఎలాంటి కథ సిద్దం చేశాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఫస్ట్పార్టులో కరీనాకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా..రెండో పార్టుకు ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. మొత్తానికి బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్ డేట్ ఇచ్చి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు సల్మాన్ ఖాన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

