Baa Baa Black Sheep | యానిమల్ ఫేం మరాఠి యాక్టర్ ఉపేంద్ర లిమాయే అంటూ లీడ్ రోల్లో వస్తోన్నచిత్రం బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep).గుణి మంచికంటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్రైం కామెడీ జోనర్లో వస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్లో జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే క్యారెక్టర్‌తోపాటు మిగిలిన యాక్టర్లతో సాగే జర్నీ వినోదాన్ని పంచేలా ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు ఉపేంద్ర లిమాయే.
నా సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. సందీప్ రెడ్డి వంగా. నేను ఎక్కడికి వెళ్లినా నాపై తెలుగు ప్రేక్షకులు కురిపించిన ప్రేమాభిమానాలు మరిచిపోలేను. వైశాఖ్, గుణి వచ్చి నాకు వినిపించిన బా బా బ్లాక్ షీప్ కథ చాలా ఆసక్తికరగా, కొత్తగా అనిపించిందన్నాడు. సాధారణంగా సమాజంలో కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా భావిస్తారు.. కానీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు వారికి సినిమా కూడా ఒక ప్రాథమిక అవసరం. అంతటి మూవీ లవర్స్ అయిన మీరంతా సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నాడు.
విష్ణు ఓయ్ మాట్లాడుతూ. సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ ఉపేంద్ర లిమాయే తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. థియేటర్ అనుభవం ఉన్న ఆయన యాక్టింగ్ మాస్టర్ క్లాస్ లాంటిది. మేఘాలయలో షూటింగ్ చేస్తున్నపుడు అక్కడి ప్రజలు మాకు ఎంతగానో సహకరించారని అన్నాడు. చాలా ఫన్, కొంచెం వైరైటీగా ఉండే ఇంట్రెస్టింగ్ టైటిల్. డైరెక్టర్ గుణి ఈ స్టోరీ చెప్పినపుడు ఎంతో ఎక్జయి అయ్యాను. ట్రైలర్లో నా పాత్రను పెద్దగా చూపించలేదు.. కానీ థియేటర్లలో సినిమా చూసినపుడు మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుందని చెప్పింది నటి మాల్వీ మల్హోత్రా.
ఈ చిత్రంలో టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట, ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఆరుగురు వ్యక్తుల ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఈ క్రమంలో వచ్చే కామెడీ, క్రైం లాంటి అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు.