Baa Baa Black Sheep | తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న చిత్రాల కోవలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజా రవీంద్ర వంటి ప్రముఖ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రాంతాలలో ఒకటైన మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి దక్షిణ భారత చిత్రంగా ‘బా బా బ్లాక్ షీప్’ ప్రత్యేక రికార్డు సృష్టించింది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులలో అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఒక అనుకోని సంఘటన ఆధారంగా నడిచే ఈ కథలో, పాత్రల ప్రవర్తన మరియు వినోదం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ను అధికారికంగా ప్రకటించింది. దసరా పండుగ కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ వార్తతో సినీ ప్రియులలో ఉత్సాహం మరింత పెరిగింది. సినిమా రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు, మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని ఘనంగా విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వయంగా ఈ పాటను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పాట యూత్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా ఉందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ పార్టీ సాంగ్ విషయానికి వస్తే.. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ లపై ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను అత్యంత కలర్ఫుల్గా తెరకెక్కించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, ప్రముఖ సింగర్ బెన్నీ దయాల్ తన హుషారైన గొంతుతో పాడారు. ఈ పాట వింటున్న ప్రతీ ఒక్కరిలోనూ జోష్ నింపేలా చాలా క్యాచీగా సాగుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. “ఓ ఆసక్తికరమైన సంఘటన చుట్టూ తిరిగే వినూత్న కథాంశంతో ‘బా బా బ్లాక్ షీప్’ సినిమాను తెరకెక్కించాము. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మేఘాలయలోని చిరపుంజి వంటి సుందరమైన ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ మూవీ ఇదే కావటం మాకు గర్వకారణం. డైరెక్టర్ గుణి మంచికంటితో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సహకారంతో అనుకున్న విధంగా సినిమాను చక్కగా పూర్తి చేశాం. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను అందిస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా కొండల్ జిన్నా వ్యవహరిస్తుండగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా శ్వేత దోనేపూడి సేవలు అందిస్తున్నారు. సంగీతం: స్టీఫెన్, ఆనంద్, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు, కెమెరామెన్: అజయ్ అబ్రహం జార్జ్, కో-డైరెక్టర్: కిషోర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి, కాస్ట్యూమ్స్: ప్రియాంక, కొరియోగ్రఫీ: జెడి మాస్టర్, యాక్షన్స్: వింగ్ చున్ అంజి, పి.ఆర్.ఓ: మోహన్ తుమ్మల వ్యవహరిస్తున్నారు.