Swayambhu Movie | నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త , నభా నటేష్ కథనాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం సంయుక్తా మేనన్ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్‌తో పాటు సంయుక్తా మేనన్, నభా నటేష్ లుక్‌లను విడుదల చేయగా నెట్టింట వైరలవుతున్నాయి.
అయితే తాజాగా ఈ చిత్రం ఆయుధపూజను నిర్వహించింది. దసరా దేవి నవరాత్రులను పురస్కరించుకుని తాజాగా స్వయంభు సెట్లో ఆయుధ పూజను నిర్వహించారు. ఈ చిత్రంలో ఉపయోగిస్తున్న ఆయుధాలన్నింటికీ పూజ చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం యూట్యూబ్ వేదికగా పంచుకుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీ విడుదల కానుండగా.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. స్వయంభు చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.