Avatar-2 | మరో విజువల్ వండర్‌గా ‘అవతార్-2’.. ఆకట్టుకుంటున్న టీజర్ ట్రైలర్!
Avatar-2 Teaser Trailer | ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్-2’. 2009లో వచ్చిన ‘అవతార్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. లేజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి ప్రతి ప్రేక్షకుడు ఫిదా అయిపోయాడు. పండోరా అనే కొత్త గ్రహాన్ని సృష్టించి, ఆ లోకంలోకి మనల్ని కూడా తీసుకెళ్ళాడు. కలెక్షన్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు 13ఏళ్ళ తర్వాత అవతార్-2 తెరకెక్కింది. ఈ చిత్రం 160 భాషల్లో డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకుల ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చేస్తున్న టీజర్ ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
ఈ సారి జేమ్స్ కామెరూన్ అవతార్‌ను సముద్రలోకంలో ఆవిష్కరించినట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. సముద్రంపై అవతార్లు నిర్మించుకున్న ఇల్లు, సముద్రం లోపల పక్షులపై ఈదుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మొత్తంగా టీజర్లో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది.
“Wherever we go, this family is our fortress.”
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
— Avatar (@officialavatar) May 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

