దేవకీ నందన వాసుదేవ
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్‌గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ కథనందించారు.
అగ్ర హీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్‌గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ కథనందించారు. మానస వారణాసి కథానాయిక. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ‘నీ బిడ్డకి మరణ గండం..లేదా అతని చేతిలో మరొకరికి మరణం..’ అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా సాగాయి.
‘ఏ యుగమైనా ఈ భూమిమీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు. వాన్ని చంపడానికి దేవుడు పుడతాడు’ అనే డైలాగ్ కథా సారాంశాన్ని తెలియజెప్పింది. అశోక్ గల్లా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. “మురారి’ తరహా సినిమా ఇదని, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుందని, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నిర్మాత సోమినేని బాలకృష్ణ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

