టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరో సినిమా తర్వాత రెండో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. Ashok Galla 2 ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. మేకర్స్ ఫస్ట్ యాక్షన్ వీడియోను లాంఛ్ చేశారు. బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
యూనిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అశోక్ గల్లా మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో తెలుస్తోంది. ప్రొడక్షన్ నంబర్ వన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఈ మూవీ హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అర్జున్ జంధ్యాల ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
ఫస్ట్ యాక్షన్ వీడియో..
అశోక్ గల్లా కొత్త సినిమా లాంఛింగ్ స్టిల్స్..
#AshokGalla2 Launched with a formal pooja ceremony❤️
Clap by @VenkyMama
1st shot Dir #BoyapatiSreenu
🎥Switch On #NamrataGhattamaneni
📝 #MiryalaRavinderReddy@PrasanthVarma @sahugarapati7 @harish_peddi@AshokGalla_ @ArjunJandyala #BheemsCeciroleo #SBalakrishna @lalithambikaoff pic.twitter.com/7zytDh18aC— BA Raju's Team (@baraju_SuperHit) February 5, 2023
Ustaad Bhagat Singh | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. హరీష్ శంకర్ ఉస్తాద్భగత్ సింగ్ అప్డేట్
Pushpa : The Rule | అసలు పుష్ప ఎక్కడ..? అల్లు అర్జున్ పుష్ప.. ది రూల్ స్టన్నింగ్ అప్డేట్
Leo | విజయ్, లోకేశ్ కనగరాజ్ లియో కొత్త అప్డేట్