కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. విజయశాంతి కీలక పాత్రను పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ నెల 17న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్ ఒక పడవపై కూర్చొని, సముద్రం వైపు తదేకంగా చూస్తూ రక్తంతో తడిసిన షర్ట్‌తో యుద్ధానికి సిద్ధమన్నట్లు కనిపిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవర్‌ఫుల్‌గా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కల్యాణ్‌రామ్, విజయశాంతి మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా కథలో కీలకంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. సోహైల్‌ఖాన్, సాయిమంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.