OG Movie | బాగా ఆకలితో ఉన్న వాళ్లకు బిర్యాని ప్యాకెట్ దొరికితే ఏ రేంజ్లో సంతోష పడతారో.. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇన్నాళ్లు రీమేక్‌లతో వెజ్ మీల్స్ తిని తిని నాలుక చచ్చుబడి పోయిన ఫ్యాన్స్‌కు ‘ఓజీ’ అంటూ జంబో సైజ్ ప్యాక్ ధమ్ బిర్యాని పెట్టాడు సుజీత్. ఆకలితో వేటాడే పులిని చూస్తారా అంటూ.. నిజంగానే పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ గురించి అంతలా ఎప్పుడూ చూడలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజైన టీజర్ పెను సంచలనమే సృష్టించింది. పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రయిట్ సినిమా వస్తే ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో ఓజీ టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది.
వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అర్జున్ దాస్ బర్త్‌డే సందర్భంగా ఓజీ సినిమా నుంచి ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. మెడపై కండువాతో ఇంటెన్సీవ్‌గా చూస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అర్జున్ దాస్ కీలకపాత్ర పోషించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ టాలీవుడ్ అమితాసక్తితో ఎదురు చూస్తుంది.
యక్షన్ థ్రిల్లర్ బ్యాక్ గ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సుజీత్ గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడట. పంజా తర్వాత దాదాపు పన్నెండేళ్లకు మళ్లీ గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తబోతున్నాడు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగం కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Wishing our multitalented @iam_arjundas a very Happy Birthday.!
See you soon on the sets of #OG#HBDArjunDas pic.twitter.com/TbzHFZXssB
— DVV Entertainment (@DVVMovies) October 5, 2023