అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ ఎటర్టైనర్ ‘కాన్ సిటీ’. అన్నా బెన్, యోగిబాబు, వడివుక్కరసి, అఖిలన్ కీలక పాత్రధారులు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో పవర్ హౌస్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
మధ్యతరగతి మనుషుల మనసుల్ని తాకేలా ఈ పోస్టర్ ఉన్నది. ప్రధాన పాత్రధారులంతా లగేజీతో వస్తుండటం, బాలనటుడు అఖిలన్ వీల్ చైర్లో ట్రోఫీతో కూర్చోవడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మంగళూరు, చెన్నై, ముంబైలలో 80శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: సీన్ రోల్డాన్.