AR rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR rahman)కి తన మాజీ భార్య సైరా భాను కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో తనతో ఉన్నందుకు రుణపడి ఉంటానని ఏఆర్ రెహమాన్‌కి థాంక్స్ చెప్పింది. ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా బాను (Saira Banu) గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఈ విషయం జరిగిన చాలారోజుల తర్వాత సైరా భాను రెహమాన్‌కి థాంక్స్ చెప్పింది.
వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా సైరా బానుకి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె న్యాయవాది వందనా షా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన రెహమాన్‌తోపాటు ఆత్మీయులకు సైరా ధన్యవాదాలు తెలిపింది. ”కొన్ని రోజుల క్రితం నేను ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరాను. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన నా మాజీ భర్త ఏ.ఆర్. రెహమాన్, సౌండ్ డిజైనర్ రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, అలాగే తన న్యాయవాది వందనా షా.. లాస్ ఏంజెల్స్‌లోని నా స్నేహితులకు కృతజ్ఞతలు అంటూ సైరా బాను చెప్పుకోచ్చింది.
ఏ.ఆర్. రెహమాన్, సైరా బాను 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఖతీజా, రహీమా, అమీన్. గత 29 ఏండ్లుగా కలిసి ఉన్న ఈ జంట 2024 నవంబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్‌కి గురిచేసింది.