AP Govt Cinema Tickets | పెద్ద సినిమాలకు ఏపీ ప్రభుత్వం షాక్..ఇకపై ప్రభుత్వ నిర్ణయం మేరకే..
సినిమా థియేటర్ల (Cinema theatres)లో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారీతిగా ఆరు, ఏడు షోలు వేస్తున్నారని ఏపీ మంత్రి పేర్నినాని (perni nani) అన్నారు.

పెద్ద సినిమాలకు ఏపీ ప్రభుత్వం (Government of AP) ఊహించని షాకిచ్చింది. సినిమా థియేటర్ల (Cinema theatres)లో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాల్సిన చోట ఇష్టారీతిగా ఆరు, ఏడు షోలు వేస్తున్నారని ఏపీ మంత్రి పేర్నినాని (perni nani) అన్నారు. బెనిఫిట్ షోల పేరుతో టికెట్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకం కోసం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును మంత్రి పేర్నినాని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టికెట్ల అమ్మకాల విషయంలో ఏ చట్టం మమ్మల్ని ఆపలేదని కొందరు..ఏ చట్టమైనా అనుకూలంగా ఉండాలని మరికొందరు భావిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా థియేటర్లలో జరుగుతున్న అవకతవకలపై ఆన్లైన్ టికెట్ విధానం (Online ticket sale) ద్వారా అడ్డుకట్ట వేయవచ్చు. ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే సినిమాను ప్రదర్శించాలి. సినిమా టికెట్ల ధరల నిర్ణయం కూడా ప్రభుత్వ నియయ నిబంధనలకు లోబడే ఉంటుంది. బస్సు, రైలు, విమాన టికెట్ల లాగే సినిమా టికెట్లను ఇంటి దగ్గరి నుంచే ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహణ..
కొత్త సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వచ్చిన కలెక్షన్లకు, జీఎస్టీ చెల్లింపులకు సంబంధం లేదని మంత్రి అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఆన్లైన్ పద్దతి ద్వారా ఎప్పటిలాగే వస్తాయి. ఆన్లైన్ పోర్టల్‌ను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఏ రోజుకారోజు ఆర్బీఐ గేట్ వే ద్వారా సినిమా హాళ్లకు డబ్బులు చెల్లిస్తాం. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే ఈ చట్టం చేశామని, అందరూ మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు మంత్రి నాని. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా చట్టం ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, ఆచార్య సినిమాలపై ప్రభావం చూపించనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాలకృష్ణ ఇరగదీసే డ్యాన్స్
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

