Anushka Shetty | టాలీవుడ్ భామ అనుష్కా శెట్టి (Anushka Shetty) లాంగ్ గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కాగా అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న Ghaatiలో నటిస్తోంది. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో మూవీ ప్రీ లుక్ లాంఛ్ చేశారు. ఈ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన అప్డేట్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఘాటి రూ.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. అంటే ఈ ఫిగర్ టైర్ 2 హీరోలు అందుకునే మార్క్‌కు సమానమన్నమాట. నేరస్థురాలిగా మారిన బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే ప్రీ, పోస్ట్ రిలీజ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. Ghaati మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
అరుంధతి సినిమాతో టాప్ హీరోలకు గట్టి పోటీ నిచ్చిన స్వీటీ.. ఆ తర్వాత భాగమతిగా అలరించింది. బాహుబలిలో దేవసేనగా మెరిసి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పటికే బాక్సాఫీస్‌ను రూల్ చేసిన అనుష్కాశెట్టి.. గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో చూపిస్తోంది. అనుష్కా శెట్టి ప్రస్తుతం Kathanar – The Wild Sorcerer అనే మలయాళ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది. రొజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది స్వీటీ.
Ghaati ప్రీ లుక్..
Anushka Shetty’s Film With Krish Is Titled ‘Ghaati’#Ghaati #KrishJagarlamudi #AnushkaShetty #FirstFramesEntertainments #AmazonPrimeVideo #Vamsi #RajivReddy #ChintakindiSrinivasRao #HariHaraVeeraMallu #BurraSaiMadhav pic.twitter.com/FQuWWf9Jh2
— SAI KRISHNA (@SAIKRIS40918887) March 20, 2024
అనుష్కా శెట్టి హ్యాపీమూడ్ ..
1M 💙 🙏 pic.twitter.com/fmCmTsJFjG
— Anushka Shetty (@MsAnushkaShetty) April 23, 2023