హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న కొత్త సినిమా ‘18 పేజెస్’. అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్నది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథా, స్క్రీన్ ప్లే అందిస్తూ బన్నీ వాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో నందిని అనే పాత్రలో నటిస్తున్నది అనుపమ. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
వలపు వర్ణాల ‘బటర్‌ఫ్లై’
అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్‌బాబు దర్శకుడు. రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మాతలు. శుక్రవారం సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చేతులు కట్టుకొని దీర్ఘాలోచనలో ఉన్న అనుపమ చుట్టూ అందమైన వర్ణాల్లో సీతాకోకచిలుక ఆవరించి ఉన్నట్లు కనిపిస్తున్నది. ‘విభిన్నమైన కథాంశమిది. కథను ప్రతిబింబించేలా పోస్టర్‌ను డిజైన్ చేశాం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: అరవింద్ షార్న్ (అర్విజ్), గిడోన్ కట్టా, నిర్మాణ సంస్థ: జెన్ నెక్ట్స్ మూవీస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంటా సతీష్‌బాబు.