Venkatesh | జాతిరత్నాలు డైరెక్టర్-వెంకటేశ్ సినిమా జోనర్ ఇదే..!
అనుదీప్ కేవీ (Anudeep KV). ఈ క్రేజీ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్ (Venkatesh)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ 3లో పొట్టచెక్కలయ్యే కామెడీతో వినోదాన్ని అందించాడు వెంకీ. యాక్షన్, కామెడీ, సీరియస్, సస్పెన్స్..ఇలా ప్రతీ జోనర్స్ లో సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు వెంకీ.
జాతిరత్నాలు (Jathiratnalu) సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు యువ దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan)తో ప్రిన్స్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు అనుదీప్ కేవీ. ఈ క్రేజీ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్ (Venkatesh)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ 3లో పొట్టచెక్కలయ్యే కామెడీతో వినోదాన్ని అందించాడు వెంకీ.
యాక్షన్, కామెడీ, సీరియస్, సస్పెన్స్..ఇలా ప్రతీ జోనర్స్ లో సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు వెంకీ. ప్రత్యేకించి వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీని సిల్వర్ స్క్రీన్‌పై చూసి కడుపుబ్బా నవ్వుకోవడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. తాజాగా వెంకీ-అనుదీప్ సినిమా అప్డేట్ ఒకటి ఫిలింగనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రిన్స్ సినిమా పనులు పూర్తయిన వెంటనే వెంకీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఇందులో వెంకీ కామెడీ యాంగిల్‌ను ఫుల్‌గా వాడుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సినిమా లైన్‌ను వెంకటేశ్‌కు వినిపించిన వెంటనే కేవలం 10 నిమిషాల్లోనే బాగా నచ్చేసిందని అనుదీప్‌కు చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. ఆ లైన్ ఆధారంగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయనున్నాడట అనుదీప్. వెంకటేశ్ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు షూటింగ్ పూర్తి చేశాడు. స్క్రిఫ్ట్ పూర్తవగానే వీలైనంత త్వరగా జాతిరత్నాలు డైరెక్టర్ సినిమా షురూ చేయాలని అనుకుంటున్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

