రాజ్‌కుమార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘యాంటీవైరస్’. సుభాష్ దర్శకుడు. కథానాయికలు ప్రియమణి, పూర్ణ, డ్యాన్స్ మాస్టర్ గణేష్‌లు ఈ చిత్రంలోని పాటలను ఇటీవల విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి చిన్న సందేశం కూడా ఉంటుంది. తప్పకుండా అందరి ఆదరణ పొందుతుందనే విశ్వాసం వుంది’ అన్నారు. అనూష, నందిత ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.