చైతన్యరావు, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. యష్ రంగినేని నిర్మించారు. జూలై 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 80 దశకం నేపథ్యంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని తెలిపారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.