ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది రాజోలు సుందరి అంజలి (Anjali). ప్రస్తుతం ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 (F3) సినిమాలో కనిపించనుంది. తీరిక లేకుండా బిజీగా ఉన్న అంజలి కొన్ని నెలల క్రితం లాస్ వెగాస్ (Las Vegas)కు వీకెంట్ ట్రిప్ వేసింది. అయితే ఆ ట్రిప్ కు సంబంధించిన త్రో బ్యాక్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రపంచ జూద రాజధాని నుంచి జ్ఞాపకాలు అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. రెడ్ ఫోర్డ్ కారు ముందు పొట్టి డ్రెస్ లో నిలబడి హమ్ చేస్తూ ఫొటోలు దిగింది. బెల్లజియో హోటల్, కాసినో, ఈఫిల్ టవర్ వెగాస్ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. అందమైన వెగాస్ లో రిసార్ట్స్ లతో నిండిన వీధుల్లో ప్రకాశవంతమైన లైట్ల మధ్య నిల్చొని అక్కడి అందాలను ఆస్వాదించింది.
అంజలి త్రోబ్యాక్ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కొద్దిగా జీవించండి అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు కన్నడలో బైరాగి చిత్రంలో నటిస్తోంది అంజలి.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర